Wednesday, 4 November 2026

కాలేశ్వరం ముంపు భూములను తీసుకొని రైతులకు మెరుగైన నష్టపరిహారం అందించాలి – అసైన్డ్

 

 

 

 

 

 

 

భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగించాలి – అసెంబ్లీలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
జనం సాక్షి, మంథని : కాలేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆనాడు ల్యాండ్ ఆక్వైజేషన్ లో భూములు తీసుకున్నారు. అనేకమంది రైతులు భూములు కోల్పోవడం జరిగిందని వారికి ఇప్పటివరకు నష్టపరిహారం రాలేదన్నారు. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ మూడు బ్యారేజ్ లకు సంబంధించి నీరు వస్తున్న సందర్భంలో బ్యాక్ వాటర్ మంథని ,కాటారం ,మహాదేవ్ పూర్ మండలంలోనీ అనేక గ్రామాల్లోని వందలాది ఎకరాల భూములు నీట మునిగి పోతున్న తరుణంలో వాటి అన్నింటిని తీసుకొని మెరుగైన నష్టపరిహారం అందించాలని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గురువారం అసెంబ్లీ సమావేశాల్లో రైతుల పక్షాన గళమెత్తారు. ముంపునకు గురవుతున్నా గ్రామాలకు సంబంధించిన రైతు సోదరుల భూములు తీసుకొని జనరల్ అవార్డు కాకుండా కన్సెంట్ అవార్డు సంబంధించి ఆ భూములను తీసుకొని వారికి న్యాయం చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని శ్రీధర్ బాబు కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 22 లక్షల ఎకరాలకు పైగా భూములను ఎస్సీ ఎస్టీ బీసీ పేద వర్గాలకు భూ పంపిణీ కింద పంపిణీ చేయడం జరిగిందని, ప్రస్తుతం ధరణి పోర్టల్ లో ఆ భూములు నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల ఆ నిరుపేద రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు వెంటనే అసైన్మెంట్ భూములను నిషేదిత జాబితాలో నుంచి తొలగించాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. అలాగే ధరణి పోర్టల్ లో నెలకొన్న అనేక సమస్యలను వెంటనే పరిష్కరించాలని శ్రీధర్ బాబు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.