Thursday, 5 November 2026

కంటి వెలుగు కార్యక్రమాని సద్వినియోగం చేసుకోవాలి ఎం పి పి

కంటి వెలుగు కార్యక్రమాని సద్వినియోగం చేసుకోవాలి
ఎం పి పి
నాంపల్లి జనవరి 10( జనం సాక్షి )తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న కంటి వెలుగు పథకంపై నాంపల్లి మండలం ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఆమెమాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కంటిచూపు సమస్యతో బాధపడుతున్న వారు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోలేని వాళ్ళ కొరకు కేసిఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో 18 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికి అదే గ్రామంలో కంటి పరీక్షలు చేసి, సమస్య లు ఉన్నవారికి తగిన మందులు ,కంటి పరికరాలు అక్కడ ఇచ్చి,ఆపరేషన్ లాంటిది అవసరమైతే దగ్గర్లో ఉన్న హాస్పిటల్లో చేయిస్తారని ఈ కార్యక్రమాన్ని మండలంలోని అధికారులు ప్రజాప్రతినిధులు వైద్య సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర రెడ్డి, ఎంపీడీవో శేష్ కుమార్ మెడికల్ ఆఫీసర్ ఇస్రాత్ ,సర్పంచ్ మునగాల సుధాకర్ రెడ్డి ,ఎంపిటిసి బెక్కం రమేష్ తదితరులు పాల్గొన్నారు.