Thursday, 5 November 2026

మునుగోడు ఉపఎనికలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న మాజీ ఎమ్మెల్యే

మునుగోడు ఉపఎనికలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న
మాజీ ఎమ్మెల్యే
నాంపల్లి జనవరి 10( జనం సాక్షి ) తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ, ప్రభుత్వ పాఠశాలలలో అభివృద్ధి చేయకుండా సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ స్థాపన కోసం దేశంలో తిరుగుతున్నాడని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలోని ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన కామేశెట్టి వెంకటయ్య చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి, అయన ఇద్దరు పిల్లలకు చెరో రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. బిజెపి నాయకుడు పూల వెంకటయ్య కుమారుడైన హనీష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా అతన్ని పరామర్శించారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతుల కు రుణమాఫీ చేయలేదని, ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి చేయలేదని, పేద ప్రజలకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల్లో నియోజకవర్గ ప్రాంతానికి అధికార పార్టీమంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి చేయలేనిది దేశంలో ఏం చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మునుగోడు కన్వీనర్ దూడల బిక్షం గౌడ్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏరెడ్ల శ్రీనివాస్ రెడ్డి, బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు బొడ్డుపల్లి శేఖర్, సింగిల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, సర్పంచ్ రేవెల్లి సుధాకర్ రెడ్డి, మలికిరెడ్డి చంద్రారెడ్డి,పూల వెంకటయ్య, బీజేవైఎం జిల్లా కోశాధికారి పానగంటి మహేష్, సంజీవ, మీనా రెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు