Tuesday, 3 November 2026

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి: ఎంపీపీ గౌరీ

 రఘునాధపాలెం  మార్చి (జనం సాక్షి) మండల పరిధిలోని పలు గ్రామాలలో స్థానిక మండల అధికారులు ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాలను  ఎంపీపీ గౌరీ, గ్రామ సర్పంచ్ ముత్తమ్మ ,చేతులమీదుగా  ప్రారంభించారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన  కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్ చిన్నబోయిన ముత్తమ్మ, ఉప సర్పంచ్ వెంకట్ నారాయణ, ఎంపీడీవో రామకృష్ణ, వెంకట్రమణ,చెన్నబాయిన సైదులు  , మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బోయినపల్లి లక్ష్మణ్ ,పిట్టల కొండయ్య, కొండపర్తి మల్లికార్జునరావు, కొనకంచి వెంకటప్పయ్య,
మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాహతి, హెల్త్ అసిస్టెంట్ ఎండి నజియా బేగం, డీఈవో క్రాంతి కుమార్, ఏఎన్ఎం  దేవిక, ఆశా వర్కర్లు వెంకటరమణ,
నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు