Tuesday, 3 November 2026

మళ్లీ బిజేపి అధికారంలోకి వస్తే ఉచిత పథకాలకు మంగళం

జుక్కల్, మార్చి 02,( జనంసాక్షి),
మళ్లీ కేంద్రంలో బిజేపి అధికారంలోకి వస్తే ఉచిత పథకాలన్నిటికి మంగళం పాడుతుందని జుక్కల్ ఎ మ్మెల్ల్యే హన్మంత్ షిండే అన్నారు. ఆయన బుధవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గ కేంద్రంలో ని అంబేద్కర్ చౌ రస్తా లో బి ఆర్ ఎస్ అధ్వర్యంలో పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలకు నిరసనగా జరిగిన ధర్నా లో పాల్గొని ప్రసంగించారు. బిజేపి ప్రభుత్వము అధికారంలోకి రాకముందు గ్యాస్ సిలిండర్ ధర 400రూపాయలు మాత్రమే ఉందని గుర్తుచేశారు. బిజేపి అధికారంలోకి వచ్చిన తరువాత గ్యాస్ సిలిండర్ ధర సంవత్సరానికి వందరూపాయలు పెంచుతూ వస్తుందని, ప్రస్తుతం ధర 1200రూపాయలకు పెరిగిందని ఆరోపించారు. ప్రస్తుతం సామాన్యులు వంట గ్యాస్ కొనలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా
సామాన్యుల కోసం రాష్ట్రంలో అధికారంలో ఉన్న బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాచేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్ల్యే ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రైతుల వడ్లను కోనుగోలు చేయడానికి కేంద్రంలోని బిజేపి నిరాకరిస్తే రాష్త్ర ప్రభుత్వం కోనుగోలు చేసిన విషయాన్ని ఎమ్మె ల్ల్యే గుర్తు చేశారు.
బిజేపి ఉచిత పథకాలకు వ్యతిరేకమని, ఒక వేళ బిజేపి మళ్ళీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలు రద్దు చేస్తారని ఎమ్మె ల్ల్యే అన్నారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు, కళ్యాణ లక్ష్మీ, శాది ముబారక్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు లాంటి పథకాలన్నీ బిజేపి రద్దు చేస్తుందని అన్నారు. ప్రజలు ఇది గమనించి ప్రమాదకర బిజెపిని అధికారంలోకి రాకుండా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో మద్నూర్, బిచ్కుంద, పిట్లం మార్కెట్ కమిటి అధ్యక్షులు సంగమేశ్వర్, వాసరి రమేష్,స్ధానిక సర్పంచ్ బొంపెల్లి రాములు, సింగిల్ విండో ఛైర్మెన్ శివానంద్, బిఆర్ యస్ నాయకులు మల్లికార్జున్, అశోక్ పాటిల్, నీలు పాటిల్, బన్షిపాటిల్, సాయగౌడ్, విజయ్, రాజు శ్రీహరి, ప్రతాప్ రెడ్డి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజా ప్రతినిదులు, మహిళలు పాల్గొన్నారు.