Tuesday, 3 November 2026

గ్యాస్ ధరల పెంపుపై భగ్గుమన్న బిఆర్ఎస్.    వంట వార్పు తో భారీ నిరసన.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చ్ 2. (జనంసాక్షి). కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ ధరలను పెంచడంపై బిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం అంబేద్కర్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ ఆధ్వర్యంలో వండవార్పుతో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఫ్ల కార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు నిరసనలో పాల్గొన్న తెలంగాణ పవర్ లు టెక్స్ టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ తో పాటు నాయకులు మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా ప్రజలపై భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. ప్రజల గురించి కాకుండా ఆదాని అంబానీ ల గురించి మాత్రమే ఆలోచించే కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ ధరలు పెంచిందని విమర్శించారు. తక్షరమే పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, పలువురు టిఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.