.
మర్పల్లి మే 12 (జనం సాక్షి) సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామంలో ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోటమర్పల్లి గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి రాజయ్య అన్నారు. బుధవారం మండల పరిధిలోని కోట మర్పల్లీ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామంలో 10 రోజులపాటు కంటి వెలుగు కార్యక్రమం చేపడతారని, గ్రామంలో ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకుని లబ్ధి పొందాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించడం వలన నిరుపేదలకు మంచి చేసిన వారు అవుతారని గ్రామ ప్రజల తరఫున సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మెతుకు ఆనందకు కృతజ్ఞతలు తెలియజేశారు. డా. వెంకట్, సిరిపురం రఘుపతి రెడ్డి, పంచాయతీ కార్యదర్శి స్వప్న, చామల జహింద్ రెడ్డి, రాహుల్, తుడుం పూలమ్మ, వేణుగోపాల్ రెడ్డి, నర్సింహా రెడ్డి నర్సిములు, సురేందర్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




