Thursday, 5 November 2026

భైంసా పట్టణం కమల థియేటర్లో ధా కేరళ స్టోరీ శో నిలిపివేత

 

 

 

 

 

 

 

 

 

 

భైంసా రూరల్ మే 12జనం సాక్షినిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కమల దియేటర్ లో ప్రదర్శించాల్సీన దా కేరళ స్టోరీ సినిమాను పట్టణ పోలీసులు శుక్రవారం అడ్డుకున్నారు.సినిమా చూడటానికి వచ్చిన వారిని పోలీసులు బైటకి పంపివేసే క్రమంలో పట్టణ పోలీసులు బిజెపి నాయకులు హిందువాహిని కార్యకర్తలకు మద్య వాగ్వవాదం చోటు చేసుకుంది.హిందువాహిని మహిళ విభాగం ప్రతినిధులు మాట్లాడుతు దియేటర్ యాజమాన్యం సినిమాను ప్రదర్శించే వరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదని భీష్మించారు.లవ్ జిహాద్ పేరుతో ఇతర మతాల అమ్మాయిలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్న వైనం పై ప్రజలకు అవగాహన కోసం ముఖ్యంగా మహిళలు ఆడపిల్లలు ఈ సినిమాను చూడాల్సిన అవసరం ఉందన్నారు. సినిమా దియేటర్ బైట అంటించిన కేరళ స్టోరీ ప్రచార పోస్టర్లను పోలీసులు చించి వేయటంతో బిజెపి జిల్లా అధ్యక్షురాలు రమాదేవి మళ్ళీ పోస్టర్లను ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు