Thursday, 5 November 2026

కన్నుల పండుగగా సీతారామచంద్రస్వామి హనుమాన్ భవాని నవగ్రహ ప్రతిష్ట

 

 

 

 

 

 

తూప్రాన్ మే 12 (జనం సాక్షి) :;; దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కేంద్రం రెడ్డి పేర్కొన్నారు తూప్రాన్ మండలంలోని ఇస్లాంపూర్ శివారులో గల రామలింగేశ్వర ఆలయం వద్ద సీతారామచంద్ర స్వామి హనుమాన్ భవాని నవగ్రహ ధ్వజ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు చిన్నచిన్న దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం పూజా సామాగ్రి పూజారికి జీతభత్యము ఇస్తూ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రంలో లేని విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని పర్యాటకులను ఆకర్షించడానికి అనేక అద్భుత భవనాలను నిర్మాణాలను నిర్మిస్తున్నారని అన్నారు వాటి వల్ల పర్యాటకులు పెరగడంతో పాటు వ్యాపార వాణిజ్య అభివృద్ధి జరుగుతుందని అన్నారు జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న రామలింగేశ్వర స్వామి దేవాలయం భవిష్యత్తులో భక్తులను ఆకర్షిస్తూ కోరిన కోరికలు తీర్చే దేవుడుగా ప్రసిద్ధి చెందుతుందని అన్నారు సీత రామ లక్ష్మణ ఆలయం హనుమత్ ప్రతిష్ట భవాని దేవాలయం నిర్మాణము నవగ్రహ ధ్వజ ప్రతిష్ట కార్యక్రమం గత మూడు రోజులుగా వేద బ్రాహ్మణులు ఆత్రేయ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు విగ్రహాలకు మూడు రోజులు ప్రత్యేక పూజలు హోమములు జపములు నిర్వహించారు స్థాపిత దేవత విగ్రహాలను శుక్రవారం రోజు ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. 108 కళాశాలతో మహా కుంభాభిషేకం నిర్వహించారు అనంతరం దేవత విగ్రహాలను ప్రత్యేక పూజలతో అలంకరించారు నాచగిరి పీఠాధిపతి మధుసూదనానంద సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం చేశారు ఈ కార్యక్రమాన్నికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్ర అడవి అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాపరెడ్డి ఎలక్షన్ రెడ్డి జడ్పిటిసి రాని సత్యనారాయణ గౌడ్ సర్పంచ్ ఆలయ చైర్మన్ సురేందర్ రెడ్డి సంతోష్ రెడ్డి తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాబుల్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్ కౌన్సిలర్లు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు స్వామివారిని దర్శించుకున్నారు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదం తో పాటు అన్నదాన ప్రసాదాన్ని అందజేశారు