కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
-మండల సర్పంచుల ఫోరం విజ్ఞప్తి
*******
సైదాపూర్ జనం సాక్షి జనవరి 16 రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్ష, కార్యదర్శి చందా శ్రీనివాస్, కాయిత రాములు విజ్ఞప్తి చేశారు. సోమవారం మండల కేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడుతూ…. అందత్వం లేని తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ఏలాంటి కంటి సమస్యలు ఉన్న అత్యున్నత నాణ్యత కలిగిన వైద్యాన్ని ఖర్చులేకుండా అందుబాటులోకి తేవడమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. వైద్య శిబిరాల్లో ప్రజలందరూ వైద్య పరీక్షలు చేసుకొని కంటి అద్దాలను అందుకోవాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మన రాష్ట్రంలోనే ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని దీనిని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని కంటి బాధలనుంచి విముక్తి పొందాలని తెలిపారు. ఈనెల 19 నుంచి ప్రారంభమయ్యే వైద్య శిబిరాలకు ఆయా గ్రామాల్లోని సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు ప్రజలను తరలించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి -మండల సర్పంచుల ఫోరం విజ్ఞప్తి




