రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
బిచ్కుంద జనవరి 16 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన షేక్ హపీజుర్రహమాన్ ఉర్ఫ్ అన్వర్ పటేల్ (53) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం నాడు సాయంత్రం మండలకేంద్రంలోని స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద చాయ్ సేవించి నడకతో ఇంటికి వెళ్ళే మార్గంలో సిండికేట్ బ్యాంకు పరిసర ప్రాంతంలో వెనకనుండి టీవీఎస్ ఎక్సెల్ నడుపుతున్న చెన్నూరి రమేష్ అతివేగంగా అజాగ్రత్తగా అన్వర్ పటేల్ పై దూసుకెళ్లగా బోర్లబడి తలకు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు ఉదయం మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతుడి భార్య హాజర బేగం ఫిర్యాదు మేరకు టీవీఎస్ ఎక్సెల్ డ్రైవర్ రమేష్ మరియు బండి యజమాని గంగారాంపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలియజేశారు. మృతునికి ముగ్గురు ఆడ పిల్లలు ఒక కుమారుడు కలరు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి




