హైదరాబాద్ 8వ నిజాం నవాబు ముఖరం ఝా బహదూర్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ముఖరం జా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్‌ను ఆదేశించారు. నిజాం నవాబు భర్కత్ అలీ ఖాన్ వల్షన్ ముకరం ఝా శనివారం రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు.
ఆయన చివరి కోరిక మేరకు హైదరాబాద్‌లో అసఫ్ జాహీ టూంబ్స్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముకరం ఝా పార్ధివదేహాన్ని ఈ నెల 17న టర్కీ నుంచి నగరానికి తీసుకురానున్నారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం చౌమహల్లా ప్యాలెస్‌లో ఉంచనున్నారు.
మాజీ ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్ రావు, కె సత్యనారాయణ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, జడ్పీ చైర్మన్ కనుమళ్ల విజయ, కార్పొరేషన్ల చైర్మన్లు సర్దార్ రవీందర్ సింగ్, దామోదర్ గుప్తా, బండ శ్రీనివాస్, అనిల్ కూర్మాచలం, నగర మేయర్ సునీల్ రావు, కలెక్టర్ కర్ణన్ , జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్, కార్యదర్శి రూప్ సింగ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఓరుగంటి ఆనంద్, చల్లా హరిశంకర్, కరీంనగర్ కార్పొరేటర్లు, తదితరులు మంత్రిని పరామర్శించారు.




