Thursday, 5 November 2026

కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు పత్తి లక్ష్మణ్.

కోటగిరి జనవరి 17 జనం సాక్షి:-రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగపరుచుకునేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు పత్తి లక్ష్మణ్,ఎంపిడిఓ మారుతి,హెల్త్ సూపర్ వైజర్ సుధారాణి పేర్కొన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని కోటగిరి గ్రామ పంచాయతీ ఆవరణంలో సంభదిత శాఖల అధికారులకు కంటి వెలుగు కార్యక్రమంపై మాక్ డ్రిల్ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.అంధత్వం లేని తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు.ఈ నెల 19 నుండి ప్రారంభంమయ్యే కంటి వెలుగు వైద్య శిబిరానికి18 సం.పైబడి ప్రతి ఒక్కరు పాలుగొనేలా, ఎవరికి ఎలాంటి కంటి సమస్యలు ఉన్నాఅత్యున్నత ప్రమాణాలతో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, కళ్ళఅద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కంటి పరీక్షలకు అందరు వచ్చేవిదంగా ప్లెక్సీలు,టామ్ టామ్,చాటింపు, కరపత్రాల ద్వారా ప్రతి ఒక్కరికీ ఆహ్వాన పత్రలను అందజేసీ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని తెలిపారు.ప్రతి రోజూ ఈ వైద్య శిబిరానికి 300 మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు.మండలంలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేయడానికి కావలసిన సలహాలు,సూచనలను సంభదిత శాఖల ఏఎన్ఎం,ఆశవర్కర్స్,అంగన్వాడీ టీచర్స్,సెక్రటరీ లకు తెలియ జేశారు.ఈ కంటి వెలుగు మాక్ డ్రిల్ కార్యక్రమంలో మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు పత్తి లక్ష్మణ్,ఎంపిడిఓ మారుతి,హెల్త్ సూపర్ వైజర్ సుధారాణి,ఐసిడిఎస్ సూపర్ వైజర్ మణి,కోటగిరి సెక్రటరీ రాజేందర్,ఏఎన్ఎం,ఆశవర్క ర్స్,అంగన్వా డీ టీచర్స్ లు పాల్గొన్నారు.