నేరడిగొండజనవరి17(జనంసాక్షి):అందత్వ రహితంగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో లంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం రోజున కంటి వెలుగు అవగాహన సదస్సులో మండల ఎంపీపీ రాథోడ్ సజన్ అధ్యక్షత వహించగా ఈ సందర్భంగా మండల జడ్పీటీసీ అనిల్ జాదవ్ మాట్లాడుతూ సిఎం కెసిఆర్ నాయకత్వంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు ఒక అద్బుతమైన కార్యక్రమమని, ప్రజల కంటి సమస్యలు తీర్చే చక్కని పరిష్కారంమని జనవరి 18 నుండి కంటి వెలుగు కార్యక్రమాని విజయవంతం చేయాలని సంకల్పంతో జడ్పీటీసీ అనిల్ జాదవ్ మండలంలోని 32 జిపిలకు తన వంతు సహాయంగా ఒక్కొక్క గ్రామానికి రూ.1000 చొప్పున 32 వేలు నగదు అందజేశారు.ప్రతి గ్రామం నుంచి కంటి సమస్యలను ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జడ్పిటిసి అనిల్ జాదవ్ ఎంపీపీ సజన్ రాథోడ్ కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అబ్దుల్ సమద్ తహసీల్దార్ పవన్ చంద్ర సర్పంచ్ సుభాష్ మాజీ పీఏసీఎస్ చైర్మన్ నానక్ సింగ్ ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి సర్పంచ్లు పెంటవెంకటరమణ సుభాష్ జాదవ్ మనీషా ఎంపీటీసీలు మండల కోఆప్షన్ సభ్యులు రాయి సెంటర్ పంచాయతీ కార్యదర్శి మండల అధికారులు మెడికల్ ఆఫీసర్లు సూపర్వైజర్లు ఆశ వర్కర్లు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
కంటి వెలుగు విజయం కోసం 32వేలు ఆర్థిక సహాయం చేసిన జడ్పీటీసీ అనిల్ జాధవ్.




