కొండమల్లేపల్లి రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కేసాని లింగారెడ్డి కొండమల్లేపల్లి జనవరి 17 (జనం సాక్షి) న్యూస్: పట్టణ కేంద్రంలో మంగళవారం నాడు కొండమల్లేపల్లి రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కేసాని లింగారెడ్డి మాట్లాడుతూ బుధవారం నాడు 18న ఖమ్మం లో జరగబోయే బిఆర్ఎస్ తొలి సభను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు కేసాని లింగారెడ్డి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ సాధనకు పురుడుబోసిన చరిత్ర ఖమ్మం జిల్లాకు దక్కుతుందన్నారు. టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా అవతరించిన తరువాత మొదటి సభ ఖమ్మంలో నిర్వహించడం రానున్న రోజుల్లో బిఆర్ఎస్ విజయానికి సంకేతం అన్నారు. 70 ఏళ్లుగా కానరాని అభివృద్ధిని కేవలం 9 సంవత్సరాలలో సాధించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కి దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలలో అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలనే బిఆర్ఎస్ పార్టీని స్థాపించారని అన్నారు. ఖమ్మంలో జరగబోయే బిఆర్ఎస్ తొలి సభ కు రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాదిమంది తరలి వస్తున్నారని,మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ముఖ్య నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారని తెలిపారు ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు సభకు హాజరయ్యేలా చేయాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కోరారు.
నేడు ఖమ్మంలో జరగబోయే బిఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయండి




