Thursday, 5 November 2026

కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

 హుజూర్ నగర్ జనవరి 17 (జనంసాక్షి): ఈనెల 18వ తారీకు నుండి నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమంలో అధికారులు సమన్వయంతో కలిసి పని చేసి విజయవంతం చేయాలని ఆర్డీవో వెంకారెడ్డి, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ ఎండి నిరంజన్ ఆదేశించారు. మంగళవారం హుజూర్ నగర్ మండల పరిధిలోని అమరవరం గ్రామం నందు ఏర్పాటుచేసిన కంటి వెలుగు శిబిర ఏర్పాట్లను పరిశీలించి వారు మాట్లాడుతూ 18 సంవత్సరాల పైబడిన వయసు ఉన్న వారందరూ కంటి వెలుగు కేంద్రాలకు వచ్చే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. కంటి వెలుగు కేంద్రాలకు వచ్చే వారికి త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ పుష్పలత, జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, గ్రామ సర్పoచ్ సుజాతఅంజిరెడ్డి, మండల ఆరోగ్య విస్తరణ అధికారి గజగంటి ప్రభాకర్, ఎంపీ ఓ మౌలానా, ఎస్ యు ఓ అంజయ్య గౌడ్, ఉదయగిరి శ్రీనివాస్, జి.విజయ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.