…
▪️ఎమ్మెల్యే జోగు రామన్న వెంటనే క్షమాపణ చెప్పాలి…
– బీజేపి గిరిజన మోర్చ జిల్లా అధ్యక్షుడు మరప రాజు…
ఇంద్రవెల్లి : జనవరి 17 (జనం సాక్షి)ప్రజా గోస బీజేపి భరోసా అనే నినాదంతో గడప గడపకు బీజేపీ నేత మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ చేస్తున్న ప్రచారాన్ని తప్పు బడుతు బారసా జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్యే జోగు రామన్న ఎన్నికల బిచ్చగాళ్లంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ గిరిజన మోర్చ జిల్లా అధ్యక్షుడు మరప రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలో బీజేపీ నాయకులతో కలసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉట్నూర్ మండల కేంద్రంలో జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జోగు రామన్న బిజెపి నేత, రాథోడ్ రమేష్ పై చేసిన వాక్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఒక బాధ్యత గల ప్రజా ప్రతినిధి, ఎమ్మెల్యే అయి ఉండి ఎదుటివారిని అసభ్య పదజాలంతో దూషించడం సరికాదని అన్నారు. వెంటనే జోగు రామన్న చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపి ప్రజా ఆదరణ పొంది ఎక్కడ అధికారంలో వస్తుందో అనే భయంతో ఇలాంటి వ్యాఖ్యలను చేస్తున్నారన్నారు. తెలంగాణలో అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. ఎక్కడ చూసినా సమస్యలే ఉన్నాయని వాటన్నింటినీ పరిష్కరించకుండా అంతమేమే చేస్తున్న అనే భ్రమా నుండి బయటకు రావాలన్నారు. అవినీతి పాలనను తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని, రానున్న రోజుల్లో బీజేపీయే అధికారంలో వస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు ఆరెల్లి రాజలింగం, స్వచ్చ భారత్ జిల్లా కన్వీనర్ దీపక్ సింగ్ శేకావత్, బిజెపి మండల ఉపాధ్యక్షుడు రాథోడ్ భీంరావ్, బీజేవైయం మండల అధ్యక్షుడు లహనే గిరిధర్,ప్రధాన కార్యదర్శి గేడం భారత్, శంకర్ గూడ ఉప సర్పంచ్ సుధీర్, నాయకులు ముండే రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.




