హుజూర్ నగర్ జనవరి 19(జనంసాక్షి): మండల పరిధిలోని అమరవరం గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని హుజూర్ నగర్ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, సర్పంచ్ గుజ్జుల సుజాతఅంజిరెడ్డి లు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమంను గ్రామ ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు లింగారెడ్డి, మట్టారెడ్డి, చిన్న లింగారెడ్డి, మాజీ పిఎసిఎస్ చైర్మన్ కామిశెట్టి వెంకటేశ్వర్లు, నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్, మండల అభివృద్ధి అధికారి శాంత కుమారి, లింగగిరి పిహెచ్సి డాక్టర్ పుష్పలత, ఎంపీఈవో మౌలానా, ఏఎన్ఎం విజయ, శ్రీనివాస్, కార్యదర్శి నరేష్, అంగన్వాడి టీచర్లు విజయలక్ష్మి, వెంకటలక్ష్మి, ఆశ వర్కర్లు ధనమ్మ, స్వరూప, స్నేహలత, సుజాత, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలి




