Thursday, 5 November 2026

క్యాలెండర్ , డైరీ ఆవిష్కరణ

 

మోత్కూరు జనవరి 19 జనం సాక్షి : మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన క్రి.శే. పేలపూడి అచ్చమ్మ – అంతయ్య ల జ్ఞాపకార్ధంగా వారి కుమారులు పేలపూడి బ్రదర్స్ 2023 నూతన సంవత్సర సుమారు 400 నూతన డైరీలు, 1500 క్యాలెండర్లను గురువారం మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో తుంగతుర్తి శాసనసభ్యులు డా. కిషోర్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పేలపూడి చౌదరి బ్రదర్స్ మాట్లాడుతూ పొడిచేడు గ్రామంలోని ప్రతి ఇంటికి పంపిణీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రచ్చ కల్పన, జెడ్పీటీసి గొరుపల్లి శారద సంతోష్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కొనతం యాకుబ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిపిరెడ్డి సావిత్రి మేఘా రెడ్డి,వైస్ చైర్మన్ బి.వెంకటయ్య ,మదర్ డైరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీ నరసింహ రెడ్డి,వైస్ ఎంపీపీ బుశిపాక లక్ష్మి మారయ్య,మాజి మార్కెట్ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్, మున్సిపాలిటీ అధ్యక్షుడు, కౌన్సిలర్ బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి,మండల పార్టీ అధ్యక్షుడు పోన్నేబోయిన రమేష్ తదితరులు పాల్గొన్నారు.