Thursday, 5 November 2026

పేద కుటుంబాలకు ఆర్థిక సాయం.

బెల్లంపల్లి, జనవరి 19, (జనంసాక్షి )
బెల్లంపల్లి నియోజకవర్గంలోని
నెన్నెల మండలంలో గురువారం మాజీ మంత్రి గడ్డం వినోద్ పలు పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. నార్వయీపేట్ గ్రామానికి చెందిన అర్ష మారయ్య ఇటీవల అనారోగ్య కారణంగా మరణించగా అట్టి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. నెన్నెల మండల కేంద్రంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పుప్పాల రఘు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.
నెన్నెలకు చెందిన పేదింటి అమ్మాయి గుజ్జుల రజిత పెళ్ళికి ఆ కుటుంబానికీ ఆర్ధిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమం లో నెన్నెల మండల అధ్యక్షుడు దాగం రమేష్, డీసీసీ సభ్యుడు, యూత్ అధ్యక్షులు లావుడ్య రమేష్, డీసీసీ సభ్యుడు గట్టు బానేశ్, మైనార్టీ అధ్యక్షుడు మొహిద్ ఖాన్, తిరుపతి రెడ్డి, మధుకర్ రెడ్డి, చంద్రమొగిలి, సుంకరి శ్రీనివాస్, గోవింద్ సింగ్, తమ్మినవేణి రాజేష్ తదితరులు పాల్గొన్నారు