జహీరాబాద్ మే 5( జనం సాక్షి) ;ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం పేదలకు వరంలాంటిదని జహీరాబాద్ సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు శెట్టి రాథోడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని హుగ్గేలి తండా గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు క్యాంపు శిబిరాన్ని ప్రారంభించారు.అనంతరం రిజిస్ట్రేషన్ మరియు కంటి పరీక్షలు నిర్వహించే విధానాన్ని పరిశీలించారు. మొదట కంటి పరీక్షలు నిర్వహించిన వారికి సర్పంచ్ ఎంపీటీసీ చేతుల మీదుగా కళ్ళ అద్దాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో సంపూర్ణ అంధత్వ నివారణ కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. గ్రామాల్లో కంటి వెలుగు క్యాంపు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. శరీర భాగాలలో అన్నిటికన్నా ప్రధానమైనది కన్ను అన్నారు.
సర్వేంద్రియానం నయనం ప్రధానమని సున్నితమైన భాగాలను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం చక్కటి కార్యక్రమం అని అన్నారు.అన్ని భాగాల కంటే కంటి భాగం ప్రధానమైనదని చిన్న నిర్లక్ష్యం చేయడం వల్ల కంటిచూపు పోయే ప్రమాదం ఉంటుందని తెలియజేశారు. ఈ పథకము ద్వారా 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో హుగ్గేలి సర్పంచ్ రాజు, ఎంపీటీసీ రాములు మాజ్ సర్పంచ్ కిషన్ అంగన్వాడీ టీచర్ అనూష బాయి, ఆశ వర్కర్, జైనబాయ్, వార్డు మెంబర్ నీలబాయ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




