Wednesday, 4 November 2026

చెవిలో పువ్వులతో వీవోఏల నిరసన

 

 

 

 

జనంసాక్షి , కమాన్ పూర్ : వీఓఏ ల సమ్మె 19వ రోజుకు చేరుకున్న సందర్భంగా కమాన్ పూర్ సీఐటీయూ మండల కమిటీ అధ్వర్యంలో శుక్రవారం చెవిలో పువ్వులతో నిరసన తెల్పడం జరిగింది. తక్షణమే వీవో ఏ ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ చిప్పకుర్తి అరవింద్ వీఓఏ ల సీఐటీయూ మండల అధ్యక్షురాలు చొప్పరి ప్రేమలత , కార్యదర్శి ఉప్పరి శివలీల, ఉపాధ్యక్షులు చెన్నూరి మేఘమాల, సహాయ కార్యదర్శి చొప్పరి జ్యోతి, శారద, దేవిక, సుమలత, సంధ్య, రజిత తదితరులు పాల్గొన్నారు.