Thursday, 5 November 2026

కంటి వెలుగు చేయండి. – ఎంపీపీ సంతోషం రమాదేవి.

కంటి వెలుగు చేయండి.
– ఎంపీపీ సంతోషం రమాదేవి.
ఫొటో : పోస్టర్లు విడుదల చేస్తున్న ఎంపీపీ రమాదేవి.
నెన్నెల, జనవరి 13, (జనంసాక్షి )
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేయాలని ఎంపీపీ సంతోషం రమాదేవి పిలుపు నిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో కంటి వెలుగు కార్యక్రమం పోస్టర్లను విడుదల చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం గురించి ముఖ్యమంత్రి కెసిఆర్ కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించారని అన్నారు. మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం కావడంతో రెండవ విడత ఈనెల 19 నుంచి వంద రోజుల పాటు మండలంలో ఈకార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు. ఈకార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించి విజయవంతం చేయాలని అన్నారు. ఈకార్యక్రమంలో జడ్పీటీసీ సింగతి శ్యామల, ఎంపీడీఓ వరలక్ష్మి, మెడికల్ ఆఫీసర్ ఝాన్సీ, ఎంపీవో శ్రీనివాస్, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.