క్రీడాకారులు గెలుపు ఓటమి సమానంగా స్వీకరించాలి
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
మల్దకల్ జనవరి 13 (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పరిధిలోని తాటికుంట గ్రామంలో శుక్రవారం సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రీమియర్ లీగ్ సీజన్ -3 క్రికెట్ టోర్నమెంట్ నుఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి ప్రారంభించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంప్రతి గ్రామంలో క్రీడాకారులకు అన్ని రకాల సంబంధించిన క్రీడలకు ప్రాంగణమును ఏర్పాటు చేశారన్నారు.ప్రతి యువకుడు విద్యతో పాటు క్రీడా రంగాల్లో కూడా నైపుణ్యత కలిగి ఉండాలి,క్రికెట్, కబడ్డీ లో గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడడం జరిగినది.ప్రతి ఒక యువత చదువుతోపాటు క్రీడారంగంలో కూడా నైపుణ్యత కలిగి ఉండాలి,క్రీడల వల్ల మనకు శారీరకంగా మానసికంగా దృఢత్వం లభిస్తుంది.గ్రామీణ ప్రాంతాల్లో యువకులు కబడ్డీ తోపాటు ప్రతి ఒక్కరు క్రికెట్ క్రీడల్లో మంచి ప్రదర్శన ఇచ్చి రాష్ట్ర,జాతీయస్థాయిలో మంచి క్రీడా ప్రదర్శించాలన్నారు.
ప్రతి ఒక్క క్రీడాకారులు సోదరుభావంతో కలిసిమెలిసి కీడును ప్రదర్శించాలి అని పేర్కొన్నారు.క్రీడా ప్రాంగణానికి అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి,సింగల్ విండో ఛైర్మన్ తిమ్మారెడ్డి, వైస్ ఎంపీపీ వీరన్న,మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు వెంకటన్న, మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, సర్పంచు ప్రతాప్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్ర రెడ్డి,అజయ్,చంద్రశేఖర్ రెడ్డి,మధు,ఎల్లప్ప,నారాయణ,మండలయూత్ అధ్యక్షుడు ప్రవీణ్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.




