Wednesday, 4 November 2026

కంటి వెలుగు జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి డాక్టర్ రాజేష్ ఆకస్మికంగా తనిఖీ

 

 

 

 

 

 

 

 

జనం సాక్షి/ కొల్చారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీలు చేస్తున్నట్లు ఆయన హాస్పిటల్ తెలిపారు. కంటి వెలుగు శిబిరంలో పంపిణీ చేస్తున్న అద్దాలను పరిశీలించారు. ప్రజలకు అందుతున్న సేవలను వారిని అడిగి తెలుసుకున్నారు. కంటి వెలుగు శిబిరం వద్ద రికార్డులను పరిశీలించారు. కంటి వెలుగు శిబిరంలో కంటి వైద్య పరీక్షలు చేసుకునే విధంగా గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, మొబిలైజేషన్ చేయాలని సూచించారు. నాణ్యమైన కంటి అద్దాలు సరఫరా చేసే విధంగా తనిఖీలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గణేష్ రెడ్డి, డాక్టర్ రమేష్ నాయక్, ఏపీవో మైపాల్ రెడ్డి, గ్రామపంచాయతీ సెక్రటరీ అంజయ్య ఏఎన్ఎం సంగీత , వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.