– ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
హుజూర్ నగర్ జనవరి 25 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండవ దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బుధవారం హుజూర్ నగర్ పట్టణంలో 5 వ వార్డులోని వర్తక సంఘ భవనంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ కంటి పరీక్ష జరిగేలా అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో పెట్టిన ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేయాలన్నారు. గ్రామాల్లో కంటి చూపు సమస్యతో బాధపడే వారి బాధలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో కంటి వెలుగు అనే ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు. మొదటి కంటి వెలుగు కార్యక్రమం చాలా విజయవంతం అయిందన్నారు. ఈ సారి దానిని మించి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. కంటి వెలుగు నిర్వహించేందుకు గ్రామంలో కావాల్సిన వసతులు దగ్గరుండి కల్పించాలని అన్నారు. పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరినీ పంచాయతీ అధికారులు, నేతలు ఇంటికెళ్లి ఈ కార్యక్రమం దగ్గరకు తీసుకొచ్చి పరీక్షలు చేయాలన్నారు. ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అవసరం అయినా వాళ్ళకి కళ్ళజోడు ఉచితంగా, అవసరం అయినా వారికి ఉచితంగా ఆపరేషన్ కూడా చేస్తారని తెలిపారు. కంటి వెలుగు క్యాంప్ జరిగే రోజు వార్డు సిబ్బంది అంతా అక్కడే ఉండి ఏర్పాట్లు చూడాలన్నారు. ప్రజలందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కంటి వెలుగు జిల్లా ఇన్చార్జ్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, క్యాంపు సూపర్వైజర్ ఇందిరాల రామకృష్ణ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావు, ఐదో వార్డ్ కౌన్సిలర్ దొంగరి మంగమ్మ వీరారెడ్డి, నారబోయిన నరసింహ, శీలం సైదులు, ములకలపల్లి రాంబాబు, పిట్టల నాగమణి తదితరులు పాల్గొన్నారు.
కంటి వెలుగు పథకం దేశానికే ఆదర్శం – ప్రజలందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి




