Wednesday, 4 November 2026

వేములవాడలో “విజేత” ఆర్థో హాస్పిటల్ ప్రారంభం

వేములవాడ, జనవరి 25 (జనం సాక్షి) : వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన “విజేత” ఆర్థో హాస్పిటల్ ను బుధవారం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, రాష్ట్ర టెక్స్ట్ టైల్ అండ్ పవర్ లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా అత్యాధునిక హంగులతో, ఎంతో అనుభవజ్ఞులైన డాక్టర్ల చే ఏర్పాటు చేసి, వేములవాడ ప్రాంతంలోనే 24 గంటల పాటు అత్యవసర సేవలు అందించేలా ఏర్పాటు చేసిన ఆసుపత్రి సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో
మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఫీర్ మహమ్మద్, కౌన్సిలర్లు యాచమనేని శ్రీనివాస రావు, నిమ్మశెట్టి విజయ్, గోలి మహేష్, ఇప్పపూల అజయ్, మారం కుమార్, నాయకులు పుల్కం రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, బీఆర్ఎస్ నాయకులు పొలాస నరేందర్, నామాల లక్ష్మీ రాజాం, బీజేపీ నాయకుడు కుమ్మరి శంకర్, వైద్యులు మహేష్ రావు, మనోహర్, హరికృష్ణ, రవీందర్ నిర్వాహకులు గూడూరి మధు, ఎల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.