Tuesday, 3 November 2026

కంటి వెలుగు పథకం దేశానికి ఆదర్శం

 

 

 

 

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం జనం సాక్షి న్యూస్ ఏప్రిల్ 28కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న దృశ్యంకంటి వెలుగు పథకం దేశానికే ఆదర్శమని సర్పంచ్ సోక్కుల మోహన్ రెడ్డి అన్నారు .శుక్రవారం తుర్కపల్లి మండలం పల్లెపహడ్ గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శుక్లపటానికి సంబంధించిన అందత్వం నుండి నివారణ, దూరపు చూపు, దగ్గరచూపు పరీక్షలు ,కంటి మందులు, కంటి అద్దాలు ఉచితంగా అందజేస్తారని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మోహన్ బాబు, ఉప సర్పంచ్ దేశపాండే లక్ష్మి ,పీ హెచ్ సి డాక్టర్ సుధీర్ రెడ్డి ,కంటి వెలుగు ప్రోగ్రాం డాక్టర్ వినోద్, డాక్టర్ శ్రీ వాత్సవ్, సిహెచ్ఓ రాజయ్య, పీహెచ్ఎన్ బిస్మిల్లాబి, ఏఎన్ఎం లు కరీంబి, పద్మావతి ,అంగన్వాడి టీచర్ లక్ష్మి ఆశా వర్కర్ మంజుల కో ఆప్షన్ సభ్యులు లక్ష్మి ,జాగిల్లపురం ఎట్టయ్య ,రాళ్ల బండి సుగ్రీవ చారి, గురు శ్రీశైలం ,జాగిల్లపురం సత్యనారాయణ ,ఇంద్రపాల బాలకృష్ణ, స్వామి ,దాసరి గోపాల్, పాంగల మహేష్, వి బి కే శ్యామల, తదితరులు పాల్గొన్నారు.