జనంసాక్షి రామగిరి : కరీంనగర్ వేద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికత్స పొందుతున్న సెంటనరికాలనీ భీఆర్ ఎస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు కాపురబోయిన భాస్కర్ తల్లి లక్ష్మీ ని శుక్రవారం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు . ఆమెకు వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. పుట్ట మధు వెంట రాష్ట్ర యువనాయకులు జక్కు రాకేష్ తదితరులు ఉన్నారు.




