హుజూర్ నగర్ మే 1 (జనంసాక్షి): కంటి వెలుగు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండవ దఫా కంటి వెలుగును కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం హుజూర్ నగర్ పట్టణంలోని 24వ వార్డులో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కంటి పరీక్ష జరిగేలా అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో పెట్టిన ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దామన్నారు. గ్రామాల్లో కంటి చూపు సమస్యతో బాధపడే వారి బాధలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో కంటి వెలుగు అనే ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు. మొదటి కంటి వెలుగు కార్యక్రమం చాలా విజయవంతం అయిందన్నారు. ఈ సారి దానిని మించి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించేందుకు గ్రామంలో కావాల్సిన వసతులు దగ్గరుండి కల్పించాలన్నారు. పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరినీ పంచాయతీ అధికారులు, నేతలు ఇంటికెళ్లి ఈ కార్యక్రమం దగ్గరకు తీసుకొచ్చి పరీక్షలు చేయాలన్నారు. ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అవసరం అయినా వాళ్ళకి కళ్ళజోడు ఉచితంగా, అలాగే అవసరం అయినా వారికి ఉచితంగా ఆపరేషన్ కూడా చేస్తారని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రజలందరూ కలిసి సద్వినియోగం చేసుకోవాలన్నారు. కంటి వెలుగు క్యాంప్ జరిగే రోజు వార్డు సిబ్బంది అంతా అక్కడే ఉండి ఏర్పాట్లు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు గుంజ భవాని, రామ్ గోపి, జక్కుల శంభయ్య, బీఆర్ఎస్ నాయకులు, యడ్ల విజయ్, మెడికల్ క్యాంపు సూపర్వైజర్ ఇందిరాల రామకృష్ణ, వైద్య అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




