జనంసాక్షి , కమాన్ పూర్ : పెండింగ్ బిల్లులకు సంబంధించిన నిధులు విడుదల చేయాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో కమాన్పూర్ ఎంపీడీవో విజయ్ కుమార్ కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాలలో వివిధ పనులు చేసి, అట్టి పనులకు ఎంబి రికార్డు చేసి చెక్కులు కొట్టి 6 మాసములు అవుతున్న ఇంత వరకు నిధులు విడుదల రాలేదని, అందరం సర్పంచులము అప్పులు చేసి పనులు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత అధికారులకు తమ సమస్యలను తెలియజేసి నిధులు విడుదల చేయించవలసిందిగా వారు వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బొల్లపల్లి శంకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఆకుల ఓదెలు, సర్పంచులు నీలం సరిత, తాటికొండ శంకర్, కొండ వెంకటేష్, కటకం రవీందర్, శిలారపు ఆనిత, తొగారి అన్నపూర్ణ , ఇటవేన కొమురమ్మలు పాల్గొన్నారు.




