జనంసాక్షి , మంథని : హైదరాబాదులో మే 7న, జరుగుతున్న తెలంగాణ భరోసా సభకు వేలాదిగా తరలి రావాలని బీఎస్పి నియోజకవర్గ ఇంచార్జి జనగామ రవి కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం బీఎస్పీ మంథని నియోజక వర్గం నందు భారీ బహిరంగ సభ, గోడపత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రవి కుమార్ గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కోసం బీఎస్పీ జాతియ అధ్యక్షురాలు ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బెహంజి కుమారి మాయావతి 36 మంది బిఎస్పి ఎంపీలతో లోకసభ లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మద్దతు ఇచ్చినట్లు ఆమె తెలిపారు, 1300 అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ ఇప్పుడు కేవలం ఒకే కుటుంబo మాత్రమే భోగాలు అనుభవిస్తుందని ఈ సందర్భంగా వారు ఆరోపించారు అవినీతి, మోసాలతో విసిగివేసిన తెలంగాణ ప్రజలకు భరోసా కల్పించాలని మాయావతి వస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బహుజనులు స్వచ్ఛందంగా తరలి రావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జోనల్ కన్వీనర్ కుమ్మరి సవిత, నియోజక వర్గ ఇంచార్జి కందుగుల రాజన్న అద్యక్షులు,రామిల్ల.రాకేష్, ప్రధాన కార్యదర్శి ఏట.సంపత్ కోశాదికారి. పులిపాక. బొంద్యాల్. మంథని.సెక్టార్ అద్యక్షులు. కాసిపేట.రాజ్ కుమార్ ముతారం మండలం. అద్యక్షులు.మంథని రాజు , కాటారం మండల అద్యక్షులు. బొడ్డు. రాజ బాబు మహాముతరం మండల అద్యక్షులు. రామగిరి. రాజు మహదేవ్ పూర్ మండల అద్యక్షులు.ఎండీ. అహ్మద్ రోపికుంట. సెక్టార్ అద్యక్షులు. గజ్జల. సురేష్ జల్లారం . సెక్టార్ అద్యక్షులు. రేనుకుంట్ల. మల్లేష్. మంథని అద్యక్షులు బూడిద గట్టయ్య మండల ఉప్పట్ల బూత్ అద్యక్షులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారుపాల్గొన్నారు.




