-జడ్పీ చైర్ పర్సన్ సరిత
ఇటిక్యాల (జనంసాక్షి) జనవరి 19 అందత్వాన్ని తొలగించి చూపుని ప్రసాదించే కంటి వెలుగు పథకం నిరు పేదలకు వరంలాంటిదని జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆమె హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిఫ్ట్ ఏ విజన్ కింద వచ్చేనెల 17వ తేదీన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం పురస్కరించుకొని నేను చనిపోయిన రోజు నాకళ్ళు బ్రతికి ఉన్న వారికి ఉపయోగపడేటట్లు నేత్రదానం చేసేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకుంటామన్నారు. నాతోపాటు నేత్రదానం చేసేందుకు వందమంది దాకా ముందుకు వస్తే ఒక గ్రూప్ ని పిలిపించి రిజిస్ట్రేషన్ చేయిస్తామని ఆమె తెలిపారు. పగలు, రాత్రి తేడా తెలియకుండా బ్రతుకును కొనసాగిస్తూ వస్తున్నవారికి కంటి వెలుగు పథకం గొప్ప వరమన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాలను మన రాష్ట్రంలో అమలుపరిచి పేదలకు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇటిక్యాల జెడ్పిటిసి హనుమంత్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాందేవ్ రెడ్డి, స్థానిక సర్పంచ్ సరోజమ్మ, ఎంపిటిసి వెంకటేశ్వరమ్మ, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీడీవో రాఘవ, స్పెషల్ ఆఫీసర్ మారుతి నందన్, వైద్యులు నందిని, మహేష్, ఏఎన్ఎమ్ లు, ఆశ కార్యకర్తలు, బిఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.




