Wednesday, 4 November 2026

కంటి వెలుగు పై అవగాహన సదస్సు

కంటి వెలుగు పై అవగాహన సదస్సు

టేకులపల్లి, జనవరి 5( జనం సాక్షి ): మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులానగర్ లో వైద్య సిబ్బందికి, ఆశా కార్యకర్తలకు గురువారం కంటి వెలుగు పై అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం వైద్యాధికారి డాక్టర్ మంతెన విద్యాసాగర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఈనెల 18వ తారీకు నుండి ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమం విధి,విధానాలపై ఊపిరితిత్తులకు సోకే వ్యాధులైన క్షయ, న్యుమోనియా, బ్రోంకైటీస్, స్వైన్ ఫ్లూ,కరోనా తదితర వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆప్తాలమిక్ ఆఫీసర్ సనత్ కుమార్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సీతమ్మ,పబ్లిక్ హెల్త్ నర్స్ సత్యవతి, సూపర్వైజర్లు పోరండ్ల శ్రీనివాస్, నాగు బండి వెంకటేశ్వర్లు, గుజ్జ విజయ, వీసం శకుంతల, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు