చిలప్ చేడ్/ఫిబ్రవరి/జనంసాక్షి :- మండలంలోని గంగారం గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని మన ప్రియతమా ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి పరిశీలన చేసినారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతు కంటి పరీక్షల నిర్వహణకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కంటి వెలుగు విజయవంతానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాల్లో అవగాహన కల్పించేలా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించరు అందులో భాగంగా గంగారం గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలలో ఎలాంటి లోపాలకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అవసరమైన వారికి నేత్ర పరీక్షలు నిర్వహించి, మందులు, కంటి అద్దాలు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని, 18 సంవత్సరాలకు పైబడి వయసు కలిగిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునేలా చూడాలన్నారు ఈకార్యక్రమంలో ఎంపీపీ వినోద దుర్గారెడ్డి,గ్రామ సర్పంచ్ మమతా బాబు, ఉపసర్పంచ్ సుధీర్ రెడ్డి,బీఆర్ఎస్ ముఖ్య నాయకులు జడ్పీ కో ఆప్షన్ మెంబర్ మన్సూర్ అహ్మద్, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, మండల పార్టీ ప్రెసిడెంట్ అశోక్ గౌడ్, ఇర్ఫాన్, ఆయా గ్రామాల సర్పంచులు ,ఎంపీటీసీలు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు*




