హుజూర్ నగర్ ఫిబ్రవరి 7 (జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో భవనిర్మాణ కార్మిక సంఘం సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు జడ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ జిల్లాలోని భవన నిర్మాణ రంగంలో పనిచేయు కార్మికులు సంక్షేమ బోర్డులో పెండింగ్లో మండలాల వారీగా ఉన్న క్లైమ్సును 2018 నుండి 2023 జనవరి 31 వరకు జిల్లావ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు యాక్సిడెంట్ సహజ మరణం మేటర్నిటీ మ్యారేజ్ కొరకు పెట్టుకున్నటువంటి క్లెయిమ్స్ అన్నీ కూడా నోడల్ ఆఫీసర్ ఏఎల్ఓ లు పెండింగ్లో పెట్టడం వలన కార్మికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. 2018 నుండి పెండింగ్ లో ఉంచిన ఫైల్స్ ను వెంటనే పరిష్కరించాలని నేడు ఏఐటీయూసీ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, డీసీఎల్ కి మెమోరాండం ఇవ్వటం జరుగుతుందన్నారు. కావున అన్ని మండలాల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్మికులు వచ్చి విజయవంతంచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జెట్టి ప్రసాద్, ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఇందిరాల వెంకటేశ్వర్లు, ప్రైవేట్ ఎలక్ట్రికల్ పట్టణకార్యదర్శి దగ్గుపాటి సత్యానందం, ముడుసు పాపారావు, సత్యం, నల్మాద వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.




