వరంగల్ బ్యూరో, జనవరి 17 (జనం సాక్షి)
వరంగల్ నగరంలోని కాశిబుగ్గ శ్రీ వివేకానంద కాలనీలో మంగళవారం వీరబ్రహ్మేంద్రస్వామి వసతి భవనం ప్రారంభోత్సవం తో పాటు 2023 నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు అందరూ కలిసికష్టపడి వసతి భవన నిర్మాణం చేసుకోవడం అభినందనీయమన్నారు. ఇంకా ఈ భవనానికి కావాల్సిన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సంబంధించిన నిధులను అందించేందుకు కృషి చేయనున్నట్టు హామీ ఇచ్చారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం వందలాది కోట్ల రూపాయల నిధులతో ఎంతో అభివృద్ధి చేస్తున్నానని అందరి ఆశీస్సులు తన మీద ఉండాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా కమిటీ బాధ్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్, ఓని భాస్కర్, భయ్యా స్వామి, సదానంద చారి, పున్నమాచారి, పుల్లా చారి, నారాయణ చారి శ్రీనివాస్, రాఘవాచారి, కృష్ణమూర్తి, వెంకట నరసయ్య, రాంపల్లి శ్రీనివాసాచారి, పున్నమాచారి, వీరాచారి బ్రహ్మం, ఉమేందర్ తదితరులు పాల్గొన్నారు.




