బిచ్కుంద మే 31 (జనంసాక్షి) బిజెపి మైనార్టీ మోర్చ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా సైఫుల్లా ఖాన్ ను జాతీయ మైనారిటీ కమిషన్ (NCM) ప్యానెల్ సభ్యునిగా జాతీయ మైనార్టీ కమిషన్ ఛైర్మన్ ఇక్బాల్ సింగ్ లాల్పురా నియమించారు. సైఫుల్లా ఖాన్ సామాజిక సేవలు, అన్ని మతాల పట్ల అంకితభావం మరియు పేదలకు సహాయం చేయడంలో అతని నిబద్ధతకు గుర్తింపుగా నియమించబడ్డారని అన్నారు. జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షహజాది, అఫ్సర్ పాషా నియామక పత్రం అందించారు. మైనార్టీల హక్కులను పెంపొందించేందుకు, వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తానని, వివిధ వర్గాల మధ్య ఆంతర్యాన్ని తొలగించేందుకు, సమాజంలో శాంతి, సామరస్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తానని సైఫుల్లా ఖాన్ పేర్కొన్నారు.




