Wednesday, 4 November 2026

కంటి వెలుగు శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి గ్రామ సర్పంచ్ రాజ శేఖర్

మోమిన్ పేట మే 25( జనం సాక్షి)
గ్రామాల్లో కంటి చూపు సరిగా లేనివారికి కంటి వెలుగు శిబిరం ఎంతో ఉపయోగపడుతుందని మల్లారెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ రాజశేఖర్ పేర్కొన్నారు గురువారం మోమిన్ పేట మండల పరిధిలోని మల్లారెడ్డి గూడెం గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయస్సు పైబడిన వారు కాకుండా ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు కంటి పరీక్షలు చేయించుకున్న వారికి అవసరమైన కంటి అద్దాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నందున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం నిరుపేదల పాలిట వరంగా మారిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి బ్రెజిల్ వైద్యురాలు డాక్టర్ శాలిని గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లేష్ యాదవ్ వార్డు సభ్యులు ఏఎన్ఎం ఆశా వర్కర్ తదితరులు పాల్గొన్నారు