గద్వాల నడిగడ్డ, మే 25 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల పి ఏ సి ఎస్ నందు గురువారము వరి కొనుగోలు కేంద్రాని అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహం ప్రారంభించారు.వరి మద్దత్తుధర క్వింటాలుకు ధర 2,060/- రూపాయలు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వమే రైతుల ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, ప్రతి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు అండగా నిలబడుతున్నదనీ, దేశంలో ఏకైక తెలంగాణ ప్రభుత్వం అని రైతులపట్ల అంకితాభావం, బాధ్యతయుత సీఎం కేసీఆర్ అని రైతులకు మేలు చేసే వారని, రైతుల కోసం ఎంతవరకైనా వెళ్లే రైతుబిడ్డ సీఎం కేసీఆర్ ని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి జెడ్పిటిసి కాశపోగు రాజు, పి ఏ సి ఎస్ అధ్యక్షు లు కోట్ల గోపాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ప్యాట్ల లక్ష్మీ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, వివిధ శాఖల చైర్మన్లు వైస్ చైర్మన్లు ప్రజా ప్రతినిధులు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు..
వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అలంపూర్ ఎమ్మెల్యే డా.. వి.యం. అబ్రహం




