Thursday, 5 November 2026

కంటి వెలుగు శిబిరాలను ప్రారంభించిన ఎంపీపీ

*******
సైదాపూర్ జనం సాక్షి జనవరి19మండలంలోని సైదాపూర్, రామచంద్రపూర్ గ్రామాల్లో ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి కంటి వెలుగు శిబిరాలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కంటి వెలుగు శిబిరాలను వైద్యాధికారులు పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. ప్రజలందరూ ఒకేసారి రాకుండా దశలవారీగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించాలని ఏదేవిధంగా ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎములు ప్రజలను శిబిరాలకు తీసుకొచ్చే విధంగా ప్రచారం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషలా అధికారి రాజ మనోహర్రావు, ఎంపీడీవో పద్మావతి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చందా శ్రీనివాస్, సర్పంచ్ రేగుల సుమలత అశోక్, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.