ఖమ్మం.తిరుమలాయపాలెం: (జనవరి 19,) జనం సాక్షి. మండల పరిధిలోని జోగులపాడు,రఘునాథపాలేం గ్రామ పంచాయతీలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్.. మండల పరిధిలోని జోగులపాడు,రఘునాథపాలేం గ్రామపంచాయతీలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్ వైద్యులకు, వైద్య సిబ్బందిలకు పలు సూచనలను ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని రెండో విడత ఘనంగా ప్రారంభించిందని . పేద ప్రజల కోసమే కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యొక్క ముఖ్య లక్ష్యమనీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సామాన్య ప్రజలు కార్పొరేట్ వైద్య సంస్థల ఫీజులు చెల్లించలేక నాణ్యమైన వైద్య చికిత్సలు పోందలేకపోతున్నారనీ, పేద ప్రజల కోసమే తెలంగాణ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తున్నదని, వైద్యాధికారులు కంటీ వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, గడపగడపకు వేళ్లీ అర్హులైన వారందరికీ వైద్య సేవలు అందించేందుకు కృషిచేయాలని,మండలంలోని ప్రతి గ్రామాల్లో ఆరోగ్య క్యాంపులు నిర్వహించీ రెండోవిడత కంటీ వెలుగు కార్యక్రమాన్నీ విజయవంతంచేయాలని వైద్యులకు కోరారు.
ఈ కార్యక్రమాల్లో మండల స్పెషల్ అధికారి జేడిఎ విజయ నిర్మల, కో ఆప్షన్ సభ్యులు
సైఫుద్దీన్, స్థానిక జడ్పీటీసీ సభ్యులు బెల్లం శ్రీనివాస్,ఎంపీడీవో జయరాం నాయక్, వైధ్యాధికారులు డాక్టర్ వసుంధర,రామరావు* స్థానిక సర్పంచ్ లీంగన్న,నిరుడు
దేవ భగ్యమ్మ, ఎంపీటీసీ సభ్యులు అంబేద్కర్, ఎల్.రజిత, వార్డు మెంబర్ల, మండల నాయకులు సైదా, వైద్య సిబ్బందులు, ఆశ కార్యకర్తలు,అంగన్వాడీ సీబ్బందులు, స్థానికప్రజలు పాల్గొన్నారు.
పేద ప్రజల కోసమే కంటి వెలుగు కార్యక్రమం : ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్.




