మోమిన్ పేట మే 02 జనం సాక్షికంటి వెలుగు తెలంగాణ రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ పథకం రూపుదిద్దుకుందని తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, సర్పంచ్ కొనింటి సురేష్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చిన్న కోల్కుంద గ్రామంలో మూడు రోజుల పాటు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణ, తీవ్ర కంటి వ్యాధులపై అవగాహన కల్పించడం, అవసరమైన వారికి శస్త్ర చికిత్స నిర్వహించి, కళ్ళు అద్దాలు అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని సురేష్ పేర్కొన్నారు. ఈ పథకాన్ని ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేస్తుందని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉచిత కంటి వైద్యం గ్రామస్థాయిలో అందిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి కంటి పరీక్షలు చేయించుకున్న వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటి వెలుగు మెడికల్ క్యాంపు అధికారిణి డా.షాలిని, పల్లె దవాఖానా మెడికల్ క్యాంపు అధికారిణి డా.సంగీత, క్యాంపు సూపర్ వైజర్ సరళ, ఏఎన్ఎంలు విజయ, యాదమ్మ, ఆశావర్కర్లు భాగ్య, మమత, అరుణ, విజయ, డీఈఓ సునిత, పీఎంఓఓ టీం సభ్యులు పవిత్ర, గ్రామస్తులు పాల్గొన్నారు.




