Tuesday, 3 November 2026

ప్రతి పౌరునికి భారత రాజ్యాంగ గ్రంధం ఉచితంగా అందివ్వాలి

 

 

 

 

 

 

వేములవాడ మే 2 (జనంసాక్షి)ప్రతి పౌరునికి భారత రాజ్యాంగ గ్రంధం ఉచితంగా అందివ్వాలి
ధర్మ సమాజ్ పార్టీ (డిఎస్పి) వ్యవస్థాపకులు డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ ద్వారా భారత రాజ్యాంగ గ్రంధాన్ని ప్రతి పౌరునికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అందజేయాలని వినతి పత్రం అందజేసారు,అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి భారత పౌరునికి రాజ్యాంగం గురించి తెలవాలంటే ప్రతి ఇంటికి భారత రాజ్యాంగం గ్రంధం అందివ్వాలని వారన్నారు, ఈ కార్యక్రమంలో జిల్లా ధర్మ సమాజ్ పార్టీ(డిఎస్పి) అధ్యక్షురాలు భీమ్ కీర్తన మహారాణి, ఉపాధ్యక్షులు ఎడపల్లి బాబు మహారాజు, జిల్లా కార్యదర్శి అరుణ్ మహారాజ్, జిల్లా కోశాధికారి బాలరాజ్ మహారాజ్, జిల్లా కార్యదర్శి ప్రకాష్ మహారాజ్ వేములవాడ మండల బాధ్యులు అనిల్ మహారాజ్, బోయిని పల్లి మండల అధ్యక్షులు విక్రమ్ మహారాజ్, కోనరావుపేట మండలం డిఎస్పి కార్యకర్త మనోజ్ మహారాజ్, బోయిని పల్లి మండల డిఎస్పి కార్యకర్తలు కురుమ సురేష్ మహారాజ్, కుడుకల మధు మహారాజ్, తదితరులు పాల్గొన్నారు