Tuesday, 3 November 2026

కంటి సమస్యలు ఉన్నవారు కంటి వెలుగు పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

 

 

 

 

 

 

వికారాబాద్ రూరల్ ఏప్రిల్ 26 జనం సాక్షికంటి సమస్యలు ఉన్నవారు కంటి వెలుగు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు బుధవారం వికారాబాద్ పట్టణంలోని శివారెడ్డిపేట్ లో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని సందర్శించారు.
కంటి వెలుగు పథకంలో సేవలు అందిస్తున్న వారి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తూ.అవసరమైన వారికి అద్దాలు అందించాలన్నారు.కంటి వెలుగు కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు పరిశీలించారు, కంటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నవారు కంటి వెలుగు పథకం సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ అనంతరెడ్డి పట్టణ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.