Monday, 2 November 2026

కంది నుంచి పింపాల్‌ సాగర్‌కు నాలుగు లేన్లు

భారతమాల కింద ప్రాజెక్ట్‌ మంజూరు
సంగారెడ్డి,అక్టోబర్‌30 (జ‌నంసాక్షి) : మహారాష్ట్ర సరిహద్దు వరకు మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. సంగారెడ్డి జిల్లాలోని కంది నుంచి మహారాష్ట్ర సరిహద్దుల్లోని పింపాల్‌గావ్‌ వరకు నాలుగు వరుసల మార్గాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా భారతమాల ప్రాజెక్టు కింద జాతీయ రహదారుల సంస్థ రహదారి విస్తరణ పనులను చేపట్టింది. మొత్తం 135.75 కిలోవిూటర్ల పొడవున్న ఈ రహదారిని రూ.3170 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. దీన్ని కేంద్ర రవాణాశాఖ మూడు ప్యాకేజీలుగా విభజించింది. రెండు ప్యాకేజీలను 2018లో మంజూరు చేయగా, ఇంకా ఆపనులు కొనసాగుతున్నాయి. మరో ప్యాకేజీ పనులను ఎన్‌హెచ్‌ఏ ఖరారు చేసింది. దీంతో మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులోని పింపాల్‌గావ్‌ నుంచి నుంచి మొదలయ్యే ఈ మార్గం కంది వరకు వస్తుంది.