రైతు బజార్లలో కిలో 35కే విక్రయం
కొత్త పంట వస్తేనే ధరలు తగ్గుతాయి
హైదరాబాద్,అక్టోబర్30 (జనంసాక్షి) : దిగుమతులు తగ్గి ఉల్లి ధరలు పెరగడంతో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్‌ను ఆశ్రయించింది. 500 టన్నుల ఇండెంట్ పెట్టగా మొదటి విడతగా 100 టన్నులను సప్లయ్ చేసింది. దీంతో హైదరాబాద్ సిటీలోని 11 రైతు బజార్లలో ఒక్కో వినియోగదారునికి కిలో రూ.35 చొప్పున అందిస్తున్నట్టు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి తెలిపారు. మహారాష్ట్రలోని
నాసిక్, ఏపీలోని కర్నూల్, మన రాష్ట్రంలోని గద్వాల, మహబూబ్‌నగర్ ప్రాంతాల నుంచి ఉల్లి దిగుమతులు వస్తుంటాయి. రోజుకు 70 నుంచి 100 లారీల వరకు వచ్చే ఉల్లి 35 లారీల లోడ్లు మాత్రమే వచ్చాయి. అదీ నాసిక్, కర్నూల్ నుంచి 5,567 క్వింటాళ్ల పాత ఉల్లిగడ్డలే. హైదరాబాద్‌లోని మలక్‌పేట్ ¬ల్‌సేల్ మార్కెట్‌లో ఉల్లి గరిష్ట ధర రూ.65 ఉండగా.. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.80కి పైగా అమ్ముతున్నారు. గత రెండు నెలల కిందట ధరలతో పోలిస్తే ఐదారు రెట్లు అధిక ధరలకు అమ్ముతున్నారు. డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయని మార్కెటింగ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గత ఆగస్టులో ఉల్లికి రేటు లేక ¬ల్‌సేల్ మార్కెట్‌లో రూ.5 నుంచి రూ.9లోపే అమ్మారు. సెప్టెంబరులో ¬ల్‌సేల్ లో రూ.25 నుంచి 35 వరకు విక్రయించారు. అక్టోబర్‌లో రూ.65 నుంచి రూ.100 వరకు పలుకుతోంది. ధరల స్ధిరీకరణ చర్యల్లో భాగంగా గతేడాది నాఫెడ్ 52 వేల టన్నుల ఉల్లిని మహారాష్ట్ర, గుజరాత్‌లో కొని నిల్వ చేసింది. గత ఏడాది కూడా సెప్టెంబరు చివరి వారంలో ఎగుమతులపై నిషేధం విధించింది. నిల్వ పరిమితులను చిల్లర వ్యాపారులకు వంద నుంచి ఇరవై క్వింటాళ్లు, ¬ల్‌సేలర్లకు 500 నుంచి 250కి తగ్గించినప్పటికీ ధరలు తగ్గలేదు. రకరకాల కారణాలు తోడై దిగుమతులు ఆలస్యం కావటంతో లక్ష్యం నీరుగారిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఉల్లిపంట భారీగా దెబ్బతింది. మన రాష్ట్రంలో వానాకాలం పంట పూర్తిగా పోగా.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్నాటక, గుజరాత్‌తో పాటు ఏపీలోని కర్నూల్ జిల్లాలో 50 శాతం క్రాప్ లాస్ అయ్యింది. దీంతో రాష్టాన్రికి రావాల్సిన ఉల్లి దిగుమతి పడిపోయింది. దీంతో ఉల్లి రేట్లపై ప్రభావం పడుతోంది. క్రాప్ తీసేసి మళ్లీ వేస్తుండడంతో మరో 3 నెలల పాటు ఉల్లి ధరలు తగ్గే పరిస్థితి లేదని మార్కెటింగ్ వర్గాలు చెబుతున్నాయి. మన రాష్ట్రంలోని తాండూరు, నారాయణఖేడ్, కొల్లాపూర్, అలంపూర్, నల్గొండ తదితర ప్రాంతాల్లో ఈ సీజన్‌లో ఉల్లి దాదాపు దెబ్బతిన్నది. వాస్తవానికి రాష్ట్రంలో పండే ఉల్లి అక్టోబర్, నవంబర్ నెలల్లోనే వస్తుంది.
మార్కెట్‌కు తగ్గిన ఉల్లి లారీల రాక




