Wednesday, 4 November 2026

కంది పంటతో.. మంచి గిట్టుబాటు ధర – కేవీకే ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణి

జనంసాక్షి, రామగిరి : రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రం (కే.వీ.కే) ద్వారా ఉచితంగా కంది విత్తనాలను బుధవారం కల్వచర్ల సర్పంచ్ గంట పద్మా వెంకటరమణారెడ్డి రైతులకు పంపిణీ చేశారు. కే.వీ.కే సైంటిస్టులు డాక్టర్. పిల్లి కిరణ్ (సాయిల్ టెస్ట్) , సర్పంచ్ గంట పద్మ వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. కంది పంట ఆవశ్యకతపై రైతులకు అవగాహన కల్పించారు. టి.బి.ఆర్.జీ-59 తాండూర్ సీడ్స్ వంగడా లు ఉచితంగా 10 ఎకరాలకు అందించమని వారు తెలిపారు. జూలై 15-30వ తేదీలోగా కంది పంట వేయాలని వారు సూచించారు. 170 రోజులలో పంట చేతికి వస్తుందని, ఉచితంగా సీడ్స్ తో పాటు కలుపు మందు ఇవ్వడం జరిగింది. క్వింటాల్ కంది ధర రూ.8200 వరకు ఉందన్నారు. ఎకరానికి 8 క్వింటాల వరకు పంట వస్తుందని తెలిపారు. పత్తి పంటలో అంతర్గత పంటగా కంది పంట వేయవచ్చునన్నారు. ఒక్క ఎకరంలో నాలుగు కిలోల కందులు వేయవచ్చునన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుందన్నారు. నీరు కూడా తక్కువ అవసరమని అన్నారు. సమావేశంలో రైతులు రాపల్లి రమేష్ రాపల్లి శ్రీలత బీరయ్య రవి రాములు కనకయ్య పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.