జనం సాక్షి / కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో జిల్లా ఫారెస్ట్ అధికారి, డి ఆర్ డి ఓ, నీటిపారుదల శాఖ అధికారులు పర్యటించారు. గ్రామాలలో నూతనంగా నిర్మిస్తున్న సంపద వనాలను ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలన చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో నీటిపారుదల శాఖకు చెందిన భూములలో సంపద వనాల పేరిట మొక్కలు నాటేందుకు గాను చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గణేష్ రెడ్డి ఏపీ ఓ మహిపాల్ రెడ్డి గ్రామపంచాయతీ సెక్రెటరీ మహేష్ తదితరులు పాల్గొన్నారు
సంపద వనాల కోసం స్థల పరిశీల చేసిన అధికారులు




