జనంసాక్షి , రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో బుధవారం మధ్యాహ్నం ఉప్పరేపు సంపత్ కు చెందిన గొర్రె ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ వైర్ షాక్ తో చనిపోవడం జరిగింది. సర్పంచ్ గంట పద్మా వెంకటరమణారెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి ఎలక్ట్రికల్ అధికారులు, వెటర్నరీ డాక్టర్ కి సమాచారం అందజేశారు. దాదాపు 15 వేల విలువగల గొర్రె చనిపోవడం జరిగింది కావున ప్రభుత్వపరంగా బాధితుడుని ఆదుకోవాలని సర్పంచ్ గంట పద్మా వెంకటరమణారెడ్డి విజ్ఞప్తి చేశారు.
విద్యుత్ షాక్ తో గొర్రె మృతి




